అసలైన ఎంటర్‌టైన్మెంట్ అంటూ మూడు గెటప్‌లలో కనిపించిన నాగ్..!

Sunday, August 16th, 2020, 11:30:30 AM IST

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 మరికొద్ద్ది రోజుల్లో బుల్లితెర ప్రేక్షకులకు ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించేందుకు రెడీ అవుతుంది. ఈ తరుణంలో వరుస ప్రోమోలతో నాగ్ అకట్టుకుంటున్నాడు. ఇటీవల వచ్చిన ఓ ప్రోమోలో కేవలం ఓల్డ్ లుక్‌లో కనిపించిన నాగ్ ఈ సారి ప్రొమోలో యంగ్, ఓల్డ్, మిడిల్ ఏజ్ గెటప్‌లలో కనిపించి అందరిని అలరించాడు.

మై డియర్ ఇంటి సభ్యులారా ఇంతకన్న వంద రెట్ల బెటర్ ఎంటర్‌టైన్మెంట్ నేను సెట్ చేస్తా అంటూ టీవీ రిమోట్ అందుకున్నాడు. నిజమైన ఎమోషన్స్, అసలైన ఎంటర్‌టైన్మెంట్.. ఇక్కడంతా లైవ్ అంటూ నాగ్ చెప్పిన స్టెయిల్ బిగ్‌బాస్ అభిమానులలో మరింత జోష్ నింపిందనే చెప్పాలి.