ఊహించని అవతార్ లో “బిగ్ బాస్ 3” విన్నర్ రాహుల్.!

Friday, May 22nd, 2020, 01:40:53 PM IST

తెలుగు బుల్లి తెర హిస్టరీలో బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో ఏదన్నా ఉంది అంటే అది స్టార్ మా ఛానెల్లో ప్రసారం అయ్యే బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో అని చెప్పాలి. మొత్తం మూడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ గేమ్ షో ఒకదాన్ని మించి మరొకటి పెద్ద హిట్ అయ్యాయి.

ఏ స్థాయిలో అయితే నెగిటివిటి వచ్చిందో అంతే స్థాయిలో పాజిటివిటీ కూడా వచ్చింది. ముఖ్యంగా బిగ్ బాస్ 3 సీజన్ కి అయితే మరీను. మొదట అంతా నార్మల్ గ్రాఫ్ ఉన్న మన తెలుగు యువ ఫోక్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఊహించని విధముగా చివరి నిమిషంలో భారీ ఆదరణను రాబట్టి బిగ్ బాస్ 23 టైటిల్ విజేతగా నిలిచాడు.

ఆ సమయంలో ఎంతో వైరల్ అయిన రాహుల్ ఇప్పుడు తన సరికొత్త లుక్ తో ఆశ్చర్యపరిచాడు. ఈ లాక్ డౌన్ లో ఎం చెయ్యాలో అర్ధం కాలేదో ఏమో నున్నగా గుండు గీయించేసుకొని ఆ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఇట్స్ టైం ఫర్ గుండు అన్నట్టుగా పోస్ట్ చెయ్యగా వీరి మరో కంటెస్టెంట్ హిమజ సూపర్ అంటూ రిప్లై ఇచ్చింది.