హాట్ టాపిక్: దుమ్ము దులుపుతున్న భీష్మ… షాకింగ్ మూవీ కలెక్షన్స్!

Saturday, February 22nd, 2020, 10:44:36 AM IST

నితిన్ తన కెరీర్ లో మరొక బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. మొత్తానికి చాల రోజుల తర్వాత కమర్షియల్ హిట్ కొట్టి తన సత్తా నిరూపించుకున్నాడు. సినిమా మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడం తో ఈ సినిమా కలెక్షన్లు ఊపందుకున్నాయి. శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్ళని కొల్లగొడుతూ నితిన్ కెరీర్ లోనే ఎక్కువ వసూళ్ళని రాబడుతుంది.

భీష్మ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ . 6.32 కోట్ల రూపాయల్ని వసూల్ చేసింది. ప్రపంచవ్యాప్తం గా మొదటిరోజు 8 కోట్ల రూపాయలతో బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. యూఎస్ లో దాదాపు 122 లొకేషన్లలో విడుదల అయిన భీష్మ చిత్రం 121K డాలర్లతో దూసుకుపోతుంది. మొదటిరోజే ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుపోవడం తో ఈ వారాంతంలో నితిన్ సినిమా భారీ వసూళ్ళని రాబడుతుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సరైన ప్రమోషన్లు చేయడం, శివరాత్రి కలిసి రావడం కూడా ఈ చిత్ర విజయానికి కారణాలు అని చెప్పవచ్చు.