యూట్యూబ్‌లో రికార్డ్ క్రియేట్ చేసిన భీమ్‌ ఫర్‌ రామరాజు ట్రైలర్..!

Sunday, November 1st, 2020, 01:17:23 AM IST

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం ఋఋఋ. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే దాదాపుగా ఈ సినిమా 80 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది.

ఇదిలా ఉంటే ఈ ఏడాది మార్చిలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ చేసిన ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ టీజర్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసుకుంది. మొత్తం 5 భాషలలో రిలీజ్ అయిన ఈ టీజర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ టీజర్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పటివరకు ఈ టీజర్‌ను 33.3 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. దీంతో అత్యధిక మంది వీక్షించిన టీజర్‌గా ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ టీజర్ రికార్డు నెలకొల్పింది.