‘భ‌ర‌త్ అనే నేను’ ఆ ఏరియా హ‌క్కులు క్రేజీగా!

Wednesday, February 28th, 2018, 11:18:46 PM IST

మ‌హేష్ క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న‌ `భ‌ర‌త్ అనే నేను` కొత్త పోస్ట‌ర్ అభిమానుల్లోకి దూసుకెళ్లిపోయింది. ఈ పోస్ట‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. మునుముందు ఇలాంటి మ‌రెన్నో గ్లింప్స్ ఉన్నాయ‌ని టీమ్ అలార్మ్ మోగించింది. ఇదిలా ఉంటే భ‌ర‌త్ అనే నేను ప్రీరిలీజ్‌ బిజినెస్ స్కైని ట‌చ్ చేయ‌డం ట్రేడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఇదివ‌ర‌కూ ఈ సినిమా తెలుగు, హిందీ శాటిలైట్ రైట్స్ భారీ ధ‌ర‌కు విక్ర‌యించారు. తెలుగు వెర్షన్ కు 23 కోట్లు.. హిందీ వెర్షన్ కు 16 కోట్లు ప‌లికింది. ‘భ‌ర‌త్ అనే నేను’ ఏపీ రైట్స్ 50 కోట్ల మేర డిమాండ్ ఉంద‌న్న టాక్ వినిపించింది. నైజాం క‌లుపుకుంటే టోట‌ల్ బిజినెస్ 100 ప్ల‌స్ కోట్ల‌కు వెళుతుంద‌న్న అంచ‌నాలున్నాయి. తాజాగా అత్యంత కీల‌క‌మైన‌ వైజాగ్‌, కృష్ణ, గుంటూరు ఏరియాల రిలీజ్‌కు 22.5 కోట్లు వెచ్చించి ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ ఎస్‌క్రియేష‌న్స్ రిలీజ్ హ‌క్కులు ఛేజిక్కించుకుందిట‌. ఆ ఏరియ‌ల్లో మ‌హేష్ సినిమాల్లోనే ది బెస్ట్ ప్రైజ్ ఇద‌ని తెలుస్తోంది.