డ్రగ్స్ కేసులో నటి సంజన గల్రాని ఇంట్లో సీసీబీ సోదాలు..!

Tuesday, September 8th, 2020, 11:10:23 AM IST

Sanjana Galrani

శాండిల్‌వుడ్ డ్రగ్స్ కేసులో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయన్న దానిని తేల్చేందుకు సీసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. అయితే ఈ కేసులో ఇప్పటికే పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు కొందరిని అరెస్ట్ కూడా చేశారు. తాజాగా సంజన ఈవెంట్ మేనేజర్ ప్రీతం శెట్టి ఇచ్చిన సమాచారంతో సీసీబీ అధికారులు ఇందిరా నగర్‌లోని సంజన గల్రాని ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

అయితే సరైన ఆధారాలు లభ్యమైతే కనుక సంజనను అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ కేసులో తాజాగా కేరళకి చెందిన డిజైనర్ మోడల్ నియాజ్‌ను సీసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నియాజ్ నటి రాగిణితో పాటు పలువురు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు అధికారులు గుర్తించారు. ఇదిలా ఉంటే నటి రాగిణిని ఐదు రోజులు పోలీసుల విచారణకు ఎసిసిఎం కోర్టు అనుమతులు ఇచ్చింది.