ఆసక్తిరేపుతున్న బండ్ల గణేష్ వాఖ్యలు…

Friday, May 22nd, 2020, 06:30:39 PM IST

ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియా లో హల్చల్ చేస్తూ, ఎప్పుడూ వార్తల్లో నిలిచిపోతూ ఉంటారు. కాగా తాజాగా ఇటీవల బండ్ల గణేష్ తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా చేసిన వాఖ్యలు ప్రస్తుతానికి ఆసక్తిని రేపుతున్నాయి. కాగా “తింటున్నంత సేపు ఇస్తరాకు అంటారు. తిన్నాక ఎంగిలి ఆకు అంటారు. నీతో అవసరం ఉన్నంత వరకు వరసలు కలిపి మాట్లాడతారు. అవసరం తీరాక… లేని మాటలు అంటకడతారు” అని ట్విట్టర్ లో పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే బండ్ల గణేష్ చేసిన ఈ వాఖ్యలు దర్శకుడు హరీష్ శంకర్ కోసమే అని పలు ఊహాగానాలు కూడా వచ్చాయి.

కాగా తాజాగా బండ్ల గణేష్ మళ్ళీ ఇలాంటి వాఖ్యలే చేశారు. “ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి ఆలోచించుకో.. బతికినంత కాలం బాగుపడతావ్” అని బండ్ల గణేశ్ తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా వెల్లడించారు. అయితే ఈ పోస్టు చూసిన పలువురు నెటిజన్లు స్పందిస్తూ… “ఎవరిమీదన్న అంత ఫ్రస్ట్రేషన్?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.