మరోసారి కట్టలు తెంచుకున్న బాలయ్య కోపం.. సెల్‌ఫోన్ విసిరేశాడు..!

Tuesday, November 17th, 2020, 12:13:34 AM IST

నందమూరి బాలకృష్ణ ఎప్పుడు ఏ మూడ్‌లో ఉంటాడో ఎవరూ ఊహించలేరు. ఆయనకు కోపం వస్తే ఎవరనేది చూడడు, వెంటనే చేతికి పనిచెబుతాడు. అయితే నేడు హర్ష కనుమల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ “సెహరి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బాలయ్య రిలీజ్ చేశారు. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా బాలయ్య స్టేజ్‌పై ఉన్న సమయంలో తనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అయితే బాలయ్యకు ఒక్కసారిగా కోపమొచ్చిందో ఏంటో తెలీదు కానీ తన మొబైల్ ఫోన్‌ను పీఎకు విసిరేశాడు.

ఇదిలా ఉంటే కరోనా విషయంలో కూడా బాలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ విషయంలో అశ్రద్ధ వద్దని, చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కార్తీకమాసమని దయచేసి ఎవ్వరూ పొద్దున్నే లేచి చల్లనీళ్లతో తలస్నానం చేయొద్దని సూచించారు. కరోనా అన్నది నుమోనియాకు సంబంధించినదని, అదొక లిపిడ్ ప్రొటీన్ అని, అది పరివర్తనం చెందుతూ ఉంటుందని అన్నారు. అందుకే కరోనాకు ఇప్పటి వరకు వ్యాక్సిన్ రాలేదని ఇక ముందు కూడా రాదని స్పష్టం చేశారు.