తనయుడి ఎంట్రీ కోసం బాలయ్య మరో బ్రహ్మాస్త్రం.. నెరవేరేనా..!

Wednesday, February 12th, 2020, 07:16:58 PM IST

నందమూరి బాలకృష్ణ తన కుమారుడి కోసం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో హీరోల వారసులంతా హీరోలుగా ఎంట్రీ ఇస్తుంటే బాలయ్య తనయుడు మోక్షజ్ఞ మాత్రం ఈ విషయంలో ఇంకా వెంకబడే ఉన్నాడు. అయితే మోక్షజ్ఞ సినిమాలలోకి ఎంట్రీ ఇస్తున్నాడని వార్తలు వినిపించినా, ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం అందడంలేదు.

అయితే మోక్షజ్ఞ నటనపై ఆసక్తి చూపడంలేదని అందుకే ఆయన ఇంకా సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వడం లేదన్న ప్రచారం కూడా ఎప్పటినుంచో కొనసాగుతుంది. అయితే ఈ విషయంలో బాలయ్య ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడట. న్యూయార్క్‌లో ఉన్న లీ స్టార్స్ బర్గ్ ఫిలిం ఇన్ స్టిట్యూట్‌లో ఒక షార్ట్ టర్మ్ క్రాష్ కోర్స్ తీసుకోవడానికి మోక్షజ్ఞను పంపించాలని బాలయ్య అనుకుంటున్నాడట. అమెరికా వెళ్ళొచ్చాక అయిన నటనపై తన కుమారుడికి ఆసక్తి ఏర్పడుతుందేమోనని బాలయ్యలో చిన్న ఆశ. మరి అమెరికా వెళ్ళొచాక అయిన మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి అడుగుపెడతాడా లేక మళ్ళీ మొదటికే వస్తాడా అనేది చూడాలి మరీ.