ఎన్టీఆర్ జయంతి రోజున శ్రీరామ దండకం ఆలపించనున్న బాలయ్య!

Thursday, May 27th, 2021, 10:00:02 AM IST

నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శ్రీ రామ దండకం ఆలపించనున్నారు. రేపు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు విడుదల చేయనున్నారు. అయితే ఇందుకు సంబంధించిన అప్డేట్ ను ఎన్బికే ఫిల్మ్స్ ద్వారా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. అయితే బాలయ్య నుండి ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్ రానుండటం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఇందుకు సంబంధించిన విషయాన్ని ఎన్బి కే ప్రకటన చేయగా, బాలకృష్ణ శ్రీ రామ దండకం ఆలపించడం అనే విషయాన్ని వెల్లడించారు. అయితే మరొకసారి బాలకృష్ణ అభిమానులకే, ఎన్టీఆర్ అభిమానులకు ఇది పండుగ లాంటి సందర్భం అని చెప్పాలి.