బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబో లో వస్తున్న చిత్రానికి టైటిల్ ఇదేనా!?

Sunday, July 5th, 2020, 08:33:51 PM IST

నందమూరి నట సింహం యువరత్న బాలకృష్ణ మరొకసారి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే సింహ, లెజెండ్ చిత్రాలతో బోయపాటి శ్రీను బాలయ్య ఇద్దరు కలిసి రెండు బ్లాక్ బస్టర్ విజయాలను చిత్ర పరిశ్రమ కి అందజేశారు. అయితే ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో వీరిద్దరూ మరొకసారి కలిసి పని చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ఇప్పటికే సంగీతం తమన్ అందిస్తున్నారు. మిరియాల రవీందర్ ఈ చిత్రాన్ని చాలా రిచ్ గా నిర్మిస్తున్నారు. అయితే బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయిన టీజర్ అభిమానులు తెగ నచ్చేసింది.

బాలకృష్ణ మరొక బ్లాక్ బస్టర్ కొట్టడం పక్కా అంటూ అభిమానులు అంటున్నారు. అయితే మరోసారి బోయపాటి బాలయ్యను చాలా మాస్ అండ్ పవర్ ఫుల్ పాత్రలో చూపించ నున్నారు. అయితే ఈ చిత్రానికి ఇంకా ఎటువంటి టైటిల్ పెట్టలేదు. ఈ చిత్రం పై ఎన్నో పుకార్లు వస్తున్నా, ఇటీవల మోనార్క్ అంటూ సోషల్ మీడియా లో హల్చల్ చేయగా, తాజాగా ఈ చిత్రం టైటిల్ సూపర్ మాన్ అంటూ ఫిల్మ్ నగర్ లో వార్త చెక్కర్లు కొడుతుంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడగా, ప్రస్తుతం మళ్లీ పునః ప్రారంభం అయింది. ఈ చిత్రానికి సంబంధించిన మరో కొన్ని విషయాలను చిత్ర యూనిట్ అధికారంగా ప్రకటించాల్సి ఉంది.