అవతార్-2 సినిమా షూటింగ్ రీస్టార్ట్.. వచ్చే వారం..!

Saturday, May 23rd, 2020, 01:03:43 AM IST

టెక్నాలజీని కన్నులకు కట్టినట్లుగా చూపించి సినీ చరిత్రలో ఓ చెరిగిపోని పేరు తెచ్చుకున్న అవతార్ సినిమాకు సీక్వెల్‌గా అవతార్-2 సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. జేంస్ కామెరూన్ దర్శకత్వంలో, 21 సెంచరీ ఫాక్స్ ఐఎన్‌సీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాను ఇదివరకే 2021 సంవత్సరానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. వచ్చే వారం న్యూజిలాండ్‌లో ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేసినట్టు ప్రకటిస్తూ నిర్మాత జాన్ ప్లాన్‌డో కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశాడు.