అనుష్క నిశబ్దం ఓటిటీ లోనే రానుందా!?

Tuesday, August 11th, 2020, 08:33:11 PM IST


కరోనా వైరస్ మహమ్మారి కారణం గా గత అయిదు నెలల నుండి సినిమా థియేటర్లు మూత పడి ఉన్నాయి. లాక్ డౌన్ నుండి అన్ లాక్ డౌన్ కి కేంద్రం సడలింపు ఇస్తున్న థియేటర్లు ఇపుడు అపుడే తెరుచుకునే పరిస్తితి కనబడుట లేదు. ఒక వేళ థియేటర్లు ఓపెన్ అయినా ఈ మహమ్మారి ప్రభావానికి ఏ ఒక్కరూ కూడా ఆసక్తి చూపరు. అయితే ఈ నేపధ్యంలో నిశబ్దం చిత్ర దర్శక నిర్మాతలు ఆ చిత్ర విడుదల ను ఎక్కడ చేయాలి అనే దాని పై ప్రేక్షకుల కే వదిలివేశారు.

ఈ చిత్రాన్ని ధియేటర్ లో చూడాలి అనుకుంటున్నారా, లేదంటే ఓటీట, లేదంటే ఎక్కడైనా సరే అంటూ మూడు ఆప్షన్స్ ఇచ్చారు కొన వెంకట్. అయితే 56 శాతం మంది ఓటి టి కి ఓటు వేశారు. అయితే కొద్ది రోజుల క్రితం నిశబ్దం ఆన్లైన్ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇపుడు మరొకసారి ఈ ఓటింగ్ తో ఈ చిత్రం ఆన్లైన్ ద్వారానే విడుదల అవుతుందా, లేదంటే చిత్ర యూనిట్ ఇంకా కొన్ని రోజుల పాటు వేచి చూస్తుందా అనేది తెలియాల్సి ఉంది.