చిరు సరసన అనుష్క…వర్కౌట్ అయ్యేనా?

Monday, May 17th, 2021, 05:10:23 PM IST


మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగు లు కొద్దిపాటి బ్రేక్ తీసుకున్నాయి. అయితే ఈ సినిమా అనంతరం మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ లో నటించేందుకు సన్నద్ధం అవుతున్నారు. అయితే ఈ చిత్రం లో హీరోయిన్ పాత్ర కోసం అనుష్క ను అనుకుంటున్నారు అట చిత్ర యూనిట్. అయితే లూసిఫర్ చిత్రం లో హీరోయిన్ పాత్ర లేనే లేదు. అయితే మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ పాత్ర పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే అందుకు తగ్గట్లు మార్పులు కూడా చేశారట. అయితే ఈ చిత్రం లో హీరోయిన్ పాత్ర ఫుల్ లెంగ్త్ కాకపోవడం గమనార్హం. ఒక గెస్ట్ పాత్రలా హీరోయిన్ పాత్ర ఉండనుంది. అయితే ఇందుకోసం గానూ చిత్ర యూనిట్ అనుష్క అయితే బావుంటుంది అని అనుకుంటున్నారు అట.

అయితే ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి తో అనుష్క హీరోయిన్ గా చేయలేదు. స్టాలిన్ చిత్రం లో ఒక సాంగ్ కి పరిమితం అయిన అనుష్క, సై రా చిత్రం లో పలు కీలక సన్నివేశాల్లో నటించింది. అయితే మొదటి సారి ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మెగాస్టార్ చిరంజీవి తో అనుష్క నటిస్తారా లేదా అనేది తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.