“మహా సముద్రం” లోకి పవన్ కళ్యాణ్ హీరోయిన్!

Monday, October 19th, 2020, 10:17:05 AM IST

RX 100 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి మరొక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్ హీరోగా అదితి రావు హైదరీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మహ సముద్రం సినిమా లో నటుడు, హీరో సిద్ధార్థ్ సైతం ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రం లోకి మరొక హీరోయిన్ అడుగు పెట్టింది. అజ్ఞాతవాసి చిత్రం లో పవన్ కళ్యాణ్ సరసన నటించిన అను ఎమ్మన్యూల్ ఈ చిత్రం లో మరొక కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్త యూనిట్ తాజాగా అనౌన్స్ చేసేసింది.

ఈ చిత్రం తో అయినా ఫుల్ స్వింగ్ లోకి రావాలి అని అటు సిద్ధార్ద్, శర్వానంద్, ఇటు అదితి రావు హైదరి, అను ల్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఏక కాలంలో తెలుగు మరియు తమిళ భాషల్లో తెరకెక్కించినున్నారు. ఈ చిత్రాన్ని సుంకర రామబ్రంహం నిర్మిస్తున్నారు. మొదటి చిత్రం తోనే టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి, తన రెండవ చిత్రం కోసం చాలా రోజులు వేచి ఉన్నారు. అయితే ప్రస్తుతం నటీనటుల ఎంపిక తో మహ సముద్రం చిత్ర యూనిట్ పక్క ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.