ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్

Wednesday, March 3rd, 2021, 10:32:01 AM IST


దర్శక దిగ్గజం రాజమౌళి రౌద్రం రణం రుధిరం చిత్రాన్ని మరొక లెవెల్ లోకి తీసుకెళ్తున్నారు. బాహుబలి సీరీస్ చిత్రాలతో రాజమౌళి ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతి కలిగే రీతిలో విజువల్స్ చూపించారు. అయితే అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తున్న ఈ చిత్రంలో అంతకు మించి ఉండనున్నాయి సన్నివేశాలు. ఇప్పటికే రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ల పాత్రల లుక్స్, టీజర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండ్ అయ్యాయి. వారికి తగ్గట్టుగా ఈ ఇద్దరు పవర్ ఫుల్ మాస్ హీరోలను ఆ రేంజ్ లో చూపించే కొరకు ఒక హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ తో పని చేస్తున్నారు రాజమౌళి.

ఈ సినిమా లో హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్ తో క్లైమాక్స్ సీన్ ను డిజైన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. అయితే రాజమౌళి ఇచ్చిన ఈ అప్డేట్ తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరు మాస్ హీరోలకు బాలీవుడ్, హాలీవుడ్ భామలను తీసుకున్న సంగతి తెలిసిందే. అలియా భట్, ఒలివియా మోరిస్ లు కథానాయికలు గా నటిస్తున్నారు. ఈ చిత్రం లో వారితో పాటుగా అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని, తదితర కీలక నటులు ఈ చిత్రం లో నటిస్తున్నారు. పాన్ ఇండియా గా రానున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.