ఆదిపురుష్ లో ప్రభాస్ కి జోడీ గా నటిస్తుంది తనే!

Friday, March 12th, 2021, 08:30:20 AM IST

బాహుబలి ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నారు.అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా లో సీత పాత్ర ఎవరు పోషించనున్నారు అనే దాని పై వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే కృతి సనన్ హీరోయిన్ గా నటించనున్నారు అంటూ గతం ల్ కూడా వార్తలు వచ్చాయి. అయితే వాటన్నిటికీ చిత్ర యూనిట్ ఒక క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియా వేదిక గా మరొక అప్డేట్ ను పంచుకుంది. ఈ చిత్రం లో ప్రభాస్ కి జోడీ గా, సీత పాత్ర లో నటిస్తున్నారు కృతి సనన్. ఆ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించారు.

అంతేకాక తన పాత్ర పై కృతి సనన్ స్పందించారు. ఒక కొత్త ప్రయాణం మొదలైంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆదిపురుష్ లో చేస్తుండటం పట్ల కృతి సనన్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ చిత్రం లో రావణ పాత్ర లో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ సైతం ఇటు రాధే శ్యామ్ పూర్తి చేయగా, మరోక చిత్రం సలార్ లో కూడా నటిస్తూ బిజీ గా ఉన్నారు.