మహేష్ 27 పై మరో అదిరిపోయే అప్డేట్.!

Sunday, February 23rd, 2020, 09:03:18 PM IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన “సరిలేరు నీకెవ్వరు” ఇంకా థియేటర్స్ లో సందడి చేస్తుంది.అలాగే ఇదే సమయంలో మహేష్ నటించబోయే తర్వాత సినిమా కోసం కూడా కొన్ని కీలకమైన అప్డేట్స్ కూడా సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుంచీ వైరల్ అవుతున్నాయి.అయితే మహేష్ ఇప్పుడు నటించబోతున్న 27వ సినిమాకు వంశీ తప్పుకున్నట్టుగా అధికారికంగా వార్త బయటకు వచ్చేయగా దానిని మహేష్ యూనిట్ కూడా కన్ఫర్మ్ చేసేసారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు మహేష్ తన తర్వాత చిత్రం కోసం మరో అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.ఇప్పటికే ఈ చిత్రానికి దర్శకుడు పరశురామ్ అని తెలిసిపోయింది.అయితే ఈ సినిమాపై మహేష్ ఏ మాత్రం లేట్ చెయ్యకూడదని ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది.ఇప్పటికే ఈ కొత్త సంవత్సరంలో “సరిలేరు నీకెవ్వరు” సినిమాతో పలకరించిన మహేష్ ఇప్పుడు తియ్యబోతున్న రెండో సినిమాను కూడా ఇదే ఏడాదిలో విడుదల చేసేయాలని ఫిక్స్ అయ్యినట్టుగా గట్టి బజ్ వినిపిస్తుంది.ఇదే కానీ నిజం అయితే మహేష్ అభిమానులకు ఒకే ఏడాదిలో రెండు సరైన పండుగలు అని చెప్పాలి.