సుశాంత్ సింగ్ మరణం మిస్టరీ లో మరో షాకింగ్ ట్విస్ట్..!

Friday, August 7th, 2020, 08:00:53 AM IST

Sushant-Singh

బాలీవుడ్ కు చెందిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం పెద్ద మిస్టరీగా మారిపోయింది. గత జూన్ లో ఆత్మహత్యగా మొదలైన ఈ కేసు ఇప్పుడు ఎన్నెన్నో మలుపులు తిరుగుతూ వస్తుంది. అయితే ఇప్పటికే సుశాంత్ అభిమానులు మరియు సుశాంత్ సింగ్ సానుభూతి పరులు ఈ కేసును సీబీఐ కి ఇచ్చి విచారణ చేసి అసలు నిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు.

కానీ ఎట్టకేలకు ఈ కేసు సీబీఐ కు వెళ్ళింది. ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. సుశాంత్ మరణానికి కొన్ని రోజుల ముందు అతని మేమేజర్ దిశా రిజైన్ చేసి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈమె అటాప్సి రిపోర్ట్ బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆమె రేప్ కు గురయ్యిందని అందులో తేలిందట. దీనితో ఈ కేసు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగినట్టు అని చెప్పాలి. మరి ఈ మిస్టరీ ఎక్కడ వీడుతుందో చూడాలి.