బన్నీ, కొరటాల కాంబోపై మరో బజ్.!

Sunday, August 2nd, 2020, 06:05:43 PM IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే ఓ భారీ పాన్ ఇండియన్ చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ ఈ చిత్రం ఇంకా ప్రాసెస్ లో ఉండగానే బన్నీ బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో తన 21 వ సినిమాను ప్రకటించి మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు.

అయితే ఈ సినిమాను కూడా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గానే ప్రకటించడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాపై లేటెస్ట్ గా మరో బజ్ వినిపిస్తుంది. బన్నీ మరియు కొరటాలకు హిట్ మ్యూజికల్ కాంబో అయినా దేవిశ్రీ ప్రసాదే ఈ చిత్రానికి కూడా సంగీతం అందించనున్నాడని ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. పుష్ప కు కూడా దేవినే సంగీతం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రానికి కూడా దేవి కన్ఫర్మ్ అయ్యారో లేదో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.