క్రేజీ ప్రాజెక్ట్ కి ముహూర్తం ఖరారు…పవన్ అభిమానులకు ఇక పండగే!

Tuesday, September 1st, 2020, 01:34:34 AM IST


పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో యాక్టిివ్ అవుతున్నారు. క్రియాశీల రాజకీయాల్లో ఉంటూనే మళ్లీ సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు ఒప్పుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృత గా ఎదురు చూస్తుంది మాత్రం హరీష్ శంకర్ సినిమా కోసమే. గబ్బర్ సింగ్ చిత్రం లాంటి బ్లాక్ బస్టర్ విజయం ను ఇవ్వడం తో పవన్ కళ్యాణ్ అభిమానులు అదే తరహాలో మరొక బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబో లో రానున్న సినిమా కి సబందించిన ఒక అప్డేట్ రానుంది. ఈ విషయాన్ని స్వయంగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 2 న సాయంత్రం 04:05 గంటలకు ఇందుకు సంబంధించిన అప్డేట్ పై వివరాలు తెలియజేయ నున్నారు. అయితే గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందజేసిన హరీష్ శంకర్ మరొకసారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేందుకు సిద్దం అయినప్పటి నుండి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. వకీల్ సాబ్ తో పాటుగా పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ తో మరొక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.