హాట్ టాపిక్: ఆ లెక్క ను సెట్ చేస్తున్న ప్రభాస్!

Monday, August 17th, 2020, 10:58:25 PM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరొక క్రేజీ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారు. బాహుబలి సిరీస్ చిత్రాలతో అభిమానులకు, ప్రభాస్ కి చాలా గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన సా హో చిత్రం సైతం ఎక్కువగా సమయం తీసుకుంది. అయితే ఆ తర్వాత ప్రభాస్ వరుస సినిమాలు చేసేందుకు సిద్ధం అయ్యారు. మిర్చి చిత్రం కి ముందు కనీసం ఏడాది కి ఒక చిత్రం తో అలరించిన ప్రభాస్, ఆ తర్వాత భారీ ప్రాజెక్ట్ లతో తక్కువ సినిమాలు చేస్తున్నారు. అయితే ఆ లెక్క సెట్ చేసేందుకు ప్రభాస్ సిద్ధమయ్యారు.

బాహుబలి సిరీస్, సా హొ చిత్రాల అనంతరం రాధే శ్యామ్ తో దూకుడు పెంచేశారు ప్రభాస్. నాగ్ అశ్విన్ తో మరొక క్రేజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కి ఓకే చెప్పారు. అయితే ఇది ఇలా ఉంటే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ప్రభాస్ ఒక సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు. అయితే ఇందుకు సంబంధించిన అప్డేట్ ఆగస్ట్ 18న ఉదయం 7:11 గంటలకు ప్రేక్షకులతో ప్రభాస్ పంచుకొనున్నారు. అయితే ప్రభాస్ పౌరాణిక పాత్ర చేసే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.

ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ హీరో గా ఎదిగిన తర్వాత కేవలం భారీ చిత్రాలలో మాత్రమే నటిస్తున్నారు. అయిన ప్రభాస్ తమ అభిమానులకు దగ్గరగా ఉండేందుకు వరుస ప్రాజెక్టులను అంగీకరిస్తూ ఫుల్ జోష్ లో ఉన్నారు.