మరో క్రేజీ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టిన ఇంద్రగంటి మోహనకృష్ణ

Tuesday, January 5th, 2021, 08:44:43 AM IST

తెలుగు సినీ పరిశ్రమ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో మోహన కృష్ణ ఇంద్రగంటి ఒకరు. ఈయన చిత్రాల్లో కథ చాలా కీలక పాత్రను పోషిస్తుంది. అయితే ఇటీవల వి చిత్రం తో కాస్త నిరాశ చెందినప్పటికీ, మరొక క్రేజీ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టారు ఈ దర్శకుడు. సుధీర్ బాబు హీరో గా మరొకసారి ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాను తెరెక్కిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి మోహన కృష్ణ దర్శకత్వం లో పని చేయడం ఎక్సై టింగ్ గా ఉందని హీరో అన్నారు. బెంచ్ మార్క్ స్టుడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయిక గా నటిస్తుంది.

అయితే ఈ చిత్రాన్ని సోమవారం నాడు పూజ చేసి ప్రారంభించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరియు దర్శకుడు వి వి వినాయక్ లు పూజ కార్యక్రమం కి విచ్చేశారు. అయితే మరొకసారి కలిసి పనిచేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సుధీర్ బాబు, ఇటీవల నాని తో కలిసి వి చిత్రం లో పవన్ ఫుల్ పోలీస్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ను పెట్టాల్సి ఉండగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.