కత్తి మహేష్ పై మరొక కేసు నమోదు

Friday, August 21st, 2020, 03:25:26 PM IST

తెలుగు నాట వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా కత్తి మహేష్ మారిపోయారు. ఇప్పటికే పలువురు ప్రముఖుల విషయం లో సంచలనం గా మారిన కత్తి మహేష్ పై తాజాగా మరొక కేసు నమోదు అయింది. కత్తి మహేష్ పై సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం నాడు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ జాంబాగ్ కి చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ కత్తి మహేష్ ను నేడు పిటి వారెంట్ పై నాంపల్లి కోర్టులో హజరు పరిచారు.

కత్తి మహేష్ ప్రస్తుతం చంచల్ గూడా జైలులో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితం శ్రీ రాముడు పై సోషల్ మీడియా లో అసభ్యకరమైన పోస్ట్ లు పెట్టడం తో పోలీసులు అదుపు లోకి తీసుకోవడం జరిగింది. కత్తి మహేష్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు చోట్ల హిందూ సంఘాలు కేసులు పెట్టడం జరిగింది. ఈ నెల 15 న కత్తి మహేష్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గతం లో కూడా ఇలానే వ్యాఖ్యలు చేసి, నగర బహిష్కరణ కి గురి అయిన సంగతి తెలిసిందే.