ఇక నుంచి “ఆహా” అనిపించనున్న యాంకర్ సుమ.!

Sunday, August 9th, 2020, 01:37:51 PM IST

anchor_Suma

మన తెలుగు స్మాల్ స్క్రీన్ పై టాప్ యాంకర్ అయినటువంటి సుమ కనకాల తనదైన వాక్చాతుర్యంతో ఎన్నో షోలను ఎంతో చక్కగా రక్తి కట్టించారు. ఎన్నో ఛానల్స్ లో ఎన్నో షోలకు యాంకర్ చేసే సుమ ఎన్నో సినిమా ఆడియో ఫంక్షన్లను కూడా చేసారు. అలా ఇప్పుడు ఫుల్ బిజీ బిజీ గా లైఫ్ ను కొనసాగిస్తున్న టైం లో ఊహించని విధంగా కరోనా బ్రేక్ వెయ్యడంతో కొన్నాళ్ల పాటు సినిమాలు టీవీ ఫంక్షన్లు లేకుండా పోయాయి. కానీ ఇప్పుడు టీవీ ప్రోగ్రామ్స్ మళ్ళీ స్టార్ట్ కావడంతో ఆమె ట్రాక్ లోకి వచ్చారు.

ఇప్పుడు ఇదే కాకుండా సుమ అందరితో “ఆహా” అనిపించడానికి రెడీగా ఉన్నారు. మన తెలుగు మొట్ట మొదటి స్ట్రీమింగ్ యాప్ “ఆహా” లో సుమ ఓ స్పెషల్ ప్రోగ్రాం ద్వారా కనిపించనున్నారు. అదే “ఆల్ ఈజ్ వెల్ విత్ సుమ”. ఎప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మన మంచికే అన్న టైప్ లో దూసుకెళ్లిపోవాలని చెప్తూ ప్లాన్ చేసిన ఈ ఎంటర్టైనింగ్ ప్రోగ్రాం తాలుకా ప్రీమియర్స్ “ఆహా”లో వచ్చే ఆగష్టు 15 నుంచి ప్రసారం కానున్నాయి. మరి ఈ షో ఎలా ఉండనుందో చూడాలి.