వాస్తవానికి దూరంగా మర్డర్…ఆర్జీవీ పై అమృత ఆరోపణలు!

Wednesday, August 5th, 2020, 12:59:59 AM IST

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మర్డర్ చిత్రం పై అమృత ప్రణయ్ పలు ఆరోపణలు చేసింది. వాస్తవాలకి దూరంగా మర్డర్ చిత్రం ట్రైలర్, మరియు తాజాగా విడుదల అయిన పాట ఉన్నాయి అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యవహారం పై అమృత కోర్టు ను ఆశ్రయించడం జరిగింది. ఈ సినిమా విడుదల నిలిపివేయాలని అమృత న్యాయస్థానం లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇందుకు సంబంధించిన పిటిషన్ న్యాయస్థానం ఎస్సి, ఎస్టీ కోర్టు కి చేరగా, అక్కడి నుండే దర్శక నిర్మాతలకి నోటీసులు జారీ చేయడం జరిగింది.

అయితే ఈ మెయిల్ మరియు వాట్స్ ఆప్ ల ద్వారా నోటీసులు పంపినట్లు సమాచారం. అయితే అమృత ప్రణయ్ నిజ జీవితంలో జరిగిన సంఘటన ల ఆధారం గా సినిమా తెరకెక్కించడం, అందుకు సంబంధంచిన ట్రైలర్, పాట లు వాస్తవాలకు దూరం గా ఉన్నాయి అంటూ అమృత ఆరోపించడం తో మళ్లీ ఈ చిత్రం పై ప్రజలు చర్చలు జరుపుతన్నారు. అయితే వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం ఇటువంటి వాటికి బెదరకుండా తన పనిని తాను చేసుకుంటూ పోతున్నారు. గతం లో సైతం ఇలాంటివి చాలానే ఎదుర్కొన్నారు వర్మ.