కరోనా ను జయించి డిశ్చార్జ్ అయిన అమితాబ్ బచ్చన్!!

Sunday, August 2nd, 2020, 07:29:50 PM IST

దాదాపు 20 రోజుల తరవాత కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు అమితాబ్ బచ్చన్. కరోనా వైరస్ ను జయించి డిశ్చార్జ్ కావడం తో అమితాబ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజా గా జరిపిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలలో అమితాబ్ కరోనా వైరస్ నెగటివ్ అని తేలింది. దీంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.జూలై 11 న ముంబై లోని నానావతి ఆసుపత్రి లో జాయిన్ అయిన అమితాబ్ నేడు డిశ్చార్జ్ అయ్యారు.ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

అయితే అభిషేక్ బచ్చన్ ఇంకా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ భారిన పడి ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్ కోలుకొని డిశ్చార్జ్ కాగా, నేడు అమితాబ్ బచ్చన్ డిశ్చార్జ్ అయ్యారు. తను కోలుకోవడానికి ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ, తన అభిమానులకు ధన్య వాదాలు తెలిపారు అమితాబ్. అయితే జయా బచ్చన్ కి మొదటగా కరోనా వైరస్ నెగటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.