అల్లు ఫ్యామిలీ విమాన ప్రయాణం…వైరల్ అవుతున్న పిక్

Friday, December 11th, 2020, 08:40:28 AM IST

టాలీవుడ్ టాప్ హీరోలు అందరూ కూడా సొంత విమానాల్లో తమకు కావాల్సిన ప్రదేశాల్లో కి వెళ్తున్నారు. అయితే టాలీవుడ్ లో పలువురు తమ తమ సొంత పనులకు, సినిమా షూటింగ్ లకు వాడుతూ ఉంటారు. అయితే నీహారిక చైతన్య ల పెళ్లి అనంతరం అల్లు అర్జున్ ఫ్యామిలీ మొత్తం కూడా సొంత విమనమో తిరుగు ప్రయాణం అయింది. అయితే అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

అల్లు వారి ఫ్యామిలీ రాయల్ గా దిగిన ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. వెళ్లేప్పుడు విమాన ప్రయాణం లోనే వెళ్లిన ఈ ఫ్యామిలీ, తిరుగు ప్రయాణం లో అల్లు అర్జున్ అన్నయ్య బాబీ, అల్లు అరవింద్ కూడా జాయిన్ అయ్యారు. అయితే ఇప్పటికే పుష్ప చిత్రం షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన అల్లు అర్జున్, తిరిగి మళ్లీ షూటింగ్ లో చేరనున్నారు. డిసెంబర్ 12 నుండి హైదరాబాద్ లోని సెట్స్ లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది. ఇప్పటికే మారేడు మిల్లీ లో షూటింగ్ కోసం వెళ్ళిన చిత్ర యూనిట్ ఒకరికి కరోనా సోకడం తో హైదరాబాద్ లో షూటింగ్ కొనసాగిస్తున్నారు.