సరుకుల కోసం సూపర్ మార్కెట్ కి వెళ్ళిన అల్లు అర్జున్ నీ చూశారా?

Friday, March 27th, 2020, 12:30:37 AM IST

కరోనా వైరస్ కారణంగా ప్రజలందరూ ఇంటికే పరిమితం అయిపోయారు. చిన్న పెద్ద, గొప్ప, పేద, డబ్బు అనే తేడా లేకుండా అంతా ఇంట్లోనే ఉంటున్నారు. అత్యవసర వస్తువుల కోసం ఇంటికి కేవలం ఒక్కరు మాత్రమే బయటికి వస్తున్నారు. అయితే ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పెద్దిళ్లలో పని చేసే పని మనుషులు కూడా అంతా మానేసి వాళ్ల ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే ఇపుడు ఎవరి పనులు వాళ్లే చేసుకోవాల్సి వస్తుంది. తాజాగా అల్లు అర్జున్ కూడా తన ఇంటి కోసం సరుకులు కొనడానికి కామన్ మ్యాన్‌లాగే సూపర్ మార్కెట్‌కు వచ్చాడు.

మాస్క్ వేసుకుని, షార్ట్‌, టీ షర్ట్‌తో బయటికి వచ్చేసాడు బన్నీ, అయితే కొందరు మాత్రం బన్నీ కాదేమో అని లైట్ తీసుకున్నారు. కానీ తాను మాత్రం తన ఇంటికి చేరువలో ఉన్న సూపర్ మార్కెట్ వెళ్లి తనకు కావాల్సిన సరుకులు తీసుకున్నాడు. అల్లు అర్జున్ అల సూపర్ మార్కెట్‌లో సరుకులు కొంటున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన అభిమానులు పెద్దపెద్ద వాళ్లకే తప్పట్లేదు, మనమెంత అని అనుకుంటున్నారు.