సహాయం చేస్తూ ‘సరైనోడు’ అనిపించుకున్నాడు..!

Sunday, April 10th, 2016, 07:45:32 PM IST


మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోలు ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటూనే.. మరోవైపు చారిటి సంస్థలకు, తమ అభిమానుల కుటుంబాలకు సహాయం చేస్తూ తమ దయా గుణాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు చారిటి సంస్థలకు, అభిమానులను విరాళాలు, ఆర్ధిక సహాయం చేస్తూ ముందుండగా.. ఆ బాటలోనే మెగా యంగ్ హీరోలు కూడా పయనిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ విశాఖలోని గాజువాకలో మరణించిన చిరు అభిమానుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందజేశారు. అంతేకాకుండా, మరణించిన కుటుంబాలలోని పిల్లలను అల్లు అర్జున్ దత్తత తీసుకొని వారి చదువుకు అవసరమైన ఖర్చును తాను భరిస్తానని కూడా అల్లు అర్జున్ తెలియజేశారు.