కొడుకిచ్చిన షాక్ కు ‘బన్నీ’ కి చెమటలు పట్టాయి

Tuesday, March 29th, 2016, 06:26:54 PM IST


అల్లు అర్జున్ తాజగా తా ట్విట్టర్ లో తన కుమారుడు ‘అయాన్’ చేసిన ఐ చిలిపి పనిని గురించి అభిమానులతో పంచుకున్నాడు. అయాన్ తన ఐ ఫోన్ తీసుకుని పవన్ కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పాటలను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. తీరా తన ట్విట్టర్ ఖాతాను చూసుకున్న అల్లు అర్జున్ ఎవరీ పని చేశారా అని ఆలోచిస్తూ అది తన ముద్దుల కొడుకు చేసిన చిలిపి పనిని తెలుసుకుని ఆ సంగతిని అభిమానులతో పంచుకున్నాడు.

సరదాగా అయాన్ తన ఫోన్ తో ఆడుకుంటూ పొరపాటున సర్దార్ పాటలను ట్విట్టర్ లో ట్వీట్ చేసేశాడు. అది చూసిన బన్నీ అలా పాటలను ట్వీట్ చెయ్యడానికి నాకే 10 నిముషాలు పడుతుంది. కానీ అయాన్ చిటికెలో చేసేశాడు. అవి సర్దార్ పాటలు కాబట్టి సరిపోయింది. మరే పాటలైనా అయితే ఏమయ్యుండేదో. నా భార్య కూడా ఇదే మాట చెప్పింది. ఇకపై అయాన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ చెప్పుకొచ్చాడు. అంటే అయాన్ ఇచ్చిన షాక్ కు బన్నీకి కాసేపు చెమటలు పట్టుంటాయి మరి.