అల్లు అర్జున్ సంచలన వాఖ్యలు – ఎవరికోసమో తెలుసా…?

Thursday, February 13th, 2020, 09:49:53 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి అల వైకుంఠపురంలో చిత్ర విజయానందంలో మునిగిపోతున్నారు. బన్నీ కెరీర్ లోనే అత్యంత బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినటువంటి ఈ చిత్రం ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది. మొత్తానికి కలెక్షన్ల పరంగా నం బాహుబలి రికార్డులను ఈ చిత్రం సొంతం చేసుకుందని చిత్ర వర్గాల సమాచారం. ఇకపోతే ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, వసూళ్ల పరంగా ఇంకొన్ని రికార్డులను కూడా చెరిపివేస్తుందని అందరు అంచనా వేస్తున్నారు. ఇక అసలువై విషయం ఏంటంటే…? ఈ సినిమాకు బన్నీ తీసుకున్న రెమ్యునరేషన్ విషయంలో తాను చేసిన కొన్ని వాఖ్యలు ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారాయి.

అయితే ఈ చిత్ర నిర్మాతల్లో అల్లు అరవింద్ కూడా భాగం కావడం వలన తన రెమ్యునరేషన్ అంత కూడా అల్లు అరవింద్ ఖాతా లోకి వెళ్తుందని అందరూ భావించారు. కానీ ఈ విషయంలో బును అందరికి ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఇదే విషయమై ఒక ఇంటర్వ్యూ కార్యక్రమంలో బన్నీ ని ప్రశ్నించగా… ఈ చిత్ర విషయంలో తనకు రావాల్సిన డబ్బులు అన్ని కూడా వచ్చేశాయని, అలంటి విషయాల్లో వెనకడుగు వేసేది లేదని వివరించారు. అంతేకాకుండా తన తండ్రి అరవింద్‌తో ఈ చర్చ రాదనీ, మధ్యలో ఉన్న వ్యక్తి అన్ని చూసుకుంటారని అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చేశారు.