బన్నీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకపోవడానికి కారణం అదేనా..?

Thursday, May 5th, 2016, 11:33:42 AM IST


నిన్నటి నుండి మెగా అభిమానుల్లో పెద్ద అలజడి రేగుతోంది. నిన్న సాయనత్రం బెజవాడలో జరిగిన సరైనోడు సక్సెస్ సెలెబ్రేషన్స్ లో అల్లు అర్జున్ మాట్లాడిన తీరే ఇందుకు కారణం. సాధారణంగా మెగా హీరోల ఫంక్షన్ ఏదైనా సరే అభిమానుల మధ్య జరిగితే అందులో ఖచ్చితంగా చిరు, పవన్ ల ప్రస్తావన్ తేవాల్సిందే. అది అభిమానుల డిమాండ్. కానీ నిన్న మాత్రం అలా జరగలేదు. అభిమానులు అడుగుతున్నా బన్నీ పవన్ గురించి మాట్లాడకుండా ‘చెప్పను బ్రదర్’ అంటూ కాస్త సీరియస్ గా మాట దాటేశాడు. మొదట మైక్ పట్టుకుని సినిమా గురించి మాట్లాడిన బన్నీ పవన్ ప్రస్తావన రాగా మాట దాటేసి చిరంజీవి గురుంచి, ఆయన సినిమాల గొప్పతనం గురించి ముఖ్యంగా ఇంద్ర సినిమా గురించి మాట్లాడారు.

దీంతో అభిమానులు మెగా ఫ్యామిలీలో చాలా సౌమ్యంగా, వినయంగా ఉండే బన్నీ ఇలా చేసాడేమిటి. పవన్, బన్నీల మధ్య ఏమైనా మనస్పర్థలు వచ్చాయా.. లేకపోతే బన్నీ ఇండివిడ్యువల్ గుర్తింపు కోరుకుంటున్నాడా అంటూ ఆలోచనలో పడ్డారు. వాస్తవంగా చెప్పాలంటే పవన్ గురించి మెగా కుటుంబ సభ్యులంతా అదే పనిగా ప్రతి దగ్గరా మాట్లాడటం, ఆయన్ను పొగడటం మొదట పవన్ కే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఈ పద్దతికి ఆయన కాస్త ఇబ్బందిగా ఫీలవుతుంటాడు. కాబట్టి ఆయనకు ఇకపై ఇబ్బంది కలిగించడం ఇష్టం లేకే బన్నీ ఆ టాపిక్ స్కిప్ చేసుండొచ్చు. కానీ యాంటీ మెగా ఫ్యాన్స్ మాత్రం ట్విట్టర్ లో ‘చెప్పను బ్రదర్’ అన్న హ్యాష్ టాగ్ పెట్టి ఈ టాపిక్ ను వాయించేస్తున్నారు.

వీడియో కొరకు క్లిక్ చేయండి :