అల్లు అర్జున్ బర్త్ డే కి పుష్ప టీజర్?

Monday, March 1st, 2021, 07:10:25 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా పై టాలీవుడ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నారు. ఎర్ర చందనం, స్మగ్లింగ్, నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ సైతం ఈ చిత్రం లో ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. అయితే ఇప్పటికే విడుదల అయిన పోస్టర్లు, లీక్డ్ వీడియో లు సినిమా పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ పై సోషల్ మీడియా లో విస్తృతం గా చర్చ జరుగుతుంది. ఈ చిత్ర టీజర్ ను అల్లు అర్జున్ అభిమానుల కోసం, అల్లు అర్జున్ పుట్టిన రోజున విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఏప్రిల్ 8 వ తేదీన అల్లు అర్జున్ పుష్ప టీజర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడుతున్నారు. రోజుకి మూడు గంటలకు పైగా మేకప్ కోసం కేటాయించడం జరుగుతుంది. లారీ డ్రైవర్ లుక్ కి తగ్గట్టుగా బాడీ షేప్ ను, కలర్ ను మార్చుకుంటున్నారు అల్లు అర్జున్. అయితే ఇప్పటికే 50 శాతం సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రం లో హీరోయిన్ గా రశ్మీక మందన్నా నటిస్తుండగా, సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.