మెగాస్టార్ మాకు ఏమీ చెప్పలేదు..బన్నీ ఆసక్తికర కామెంట్స్!

Thursday, February 13th, 2020, 05:19:37 PM IST

టాలీవుడ్ లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తరంలో ఉన్న ఎందరో కుర్ర హీరోలకు ఒక రోల్ మోడల్.స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ నుంచి ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న కార్తికేయ లాంటి వారి వరకు మెగాస్టారే తమకు ప్రేరణ అని చెప్తుంటారు.అయితే ఎక్కడో బయటే కాకుండా మెగా ఫ్యామిలీ హీరోలలో కూడా ప్రతీ ఒక్కరూ మెగాస్టార్ నుంచి చాలా నేర్చుకున్న వారే..అలాంటి వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటారు.

మెగాస్టార్ చిరుకు ఎలాంటి వీరాభిమానో ఎన్నో సందర్భాల్లో తన ప్రేమను చూపించారు.అలాంటి మెగాస్టార్ పై అల్లు అర్జున్ మరోసారి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఇటీవలే విడుదల కాబడి బిగ్గెస్ట్ హిట్టయిన “అల వైకుంఠపురములో” చిత్రం సక్సెస్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “తాము ఏవైతే విలువలు పాటిస్తున్నామో అవన్నీ మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి వచ్చినవే అని,తమను ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఆయన ఏ నాడు కూడా ఏమి చెప్పలేదని,కానీ తామే ఆయన్ను చూసి చాలా నేర్చుకున్నామని అందుకే తమ కుటుంబంతో పాటుగా ఇంకా ఎందరికో ఆయన ఆదర్శంగా నిలిచారని” బన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.