అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ అప్పుడేనా?

Thursday, February 13th, 2020, 02:58:06 PM IST

అలా వైకుంఠపురం లో చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే మెగాఫ్యామిలీ గురించి అల్లు అర్జున్ పలు ఆసక్తికర విషయాలని వెల్లడించారు. తాము పాటించే విలువలన్నీ చిరంజీవి నుండి వచ్చినవే అని అల్లు అర్జున్ అన్నారు. అయన ఈరోజు ఇలా చేయండి, అలా చేయండి అని మాకు చెప్పలేదని అన్నారు. కానీ ఆయనని చూసి చాల నేర్చుకున్నామని, ఎన్నో ఒడిదుడుకులని చిరు ఎదుర్కొన్నారని తెలిపారు. అలా ఉండుట వలనమా కుటుంబంలో హీరోలతో పాటుగా మిగతా ఎందరికో చిరు స్ఫూర్తి గా నిలిచారని అల్లు అర్జున్ తెలిపారు.

అయితే బాలీవుడ్ ఎంట్రీ గురించి అల్లు అర్జున్ అనుకూలంగా స్పందించారు. మంచి కథ వస్తే బాలీవుడ్ లో తప్పకుండా నటిస్తానని తెలిపారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమ కి బాలీవుడ్ పెద్దన్న లాంటిదని అల్లు అర్జున్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. అయితే దేశంలో చాల మంచి చిత్రాలు బాలీవుడ్ నుండి స్ఫూర్తి పొందాయని అల్లు అర్జున్ అన్నారు. అంతేకాకుండా అక్కడ చాల మంచి సినిమాలు తెరకెక్కుతాయని తెలిపారు. అలా వైకుంఠపురంలో చిత్రం నాన్ బాహుబలి రికార్డులని నెలకొల్పింది. కొన్ని ఏరియాల్లో బాహుబలి 2 రికార్డులని సైతం చెరిపేసింది. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం లో నటిస్తున్నారు.