అల్లు అర్జున్ కి అధ్ధిరిపోయే బహుమతి ఇచ్చిన బ్రహ్మానందం

Friday, January 1st, 2021, 06:35:14 PM IST

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో వందల చిత్రాల్లో కమెడియన్, నటుడి గా అద్భుత ప్రదర్శన కనబరిచారు. తెలుగు ప్రేక్షకుల మదిలో చిరకాలం చెరగని ముద్ర వేసుకున్నారు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. అయితే తన నటనతో మాత్రమే కాకుండా, తను చిత్ర లేఖనం తో కూడా అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ఆయన పేపర్ పై పెన్సిల్ తో గీసిన పలు చిత్రాలు సోషల్ మీడియా లో విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా శ్రీ వెంకటేశ్వర స్వామి కి సంబంధించిన ఒక చిత్రాన్ని దాదాపు 45 రోజుల పాటు గీశారు. అయితే అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

బ్రహ్మానందం మొదటి నుండి కళాకారుడు గాత్రమే కాకుండా మంచి డ్రాయింగ్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి కి సంబంధించిన చిత్ర పటాన్ని ప్రముఖ నటుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి బహుమతి గా ఇచ్చారు. ఇదే విషయం పై నటుడు అల్లు అర్జున్ స్పందించారు. సోషల్ మీడియా లో ఆ చిత్ర పటాన్ని పోస్ట్ చేశారు. ఇది తనకు వెలకట్టలేని బహుమతి అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.