హాట్ టాపిక్: అల్లు అరవింద్ నిజంగా ఆ పని చేస్తారా?

Thursday, February 13th, 2020, 04:30:58 PM IST


తెలుగునాట హిట్ టాక్ తెచ్చుకొని, బాలీవుడ్ లో వాటిని బ్లాక్ బస్టర్ గా మలిచిన దర్శక నిర్మాతలు, హీరోలు చాల మంది వున్నారు. అయితే అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. బాహుబలి2 రికార్డులని కూడా పలు చోట్ల బద్దలుకొట్టింది. అయితే ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే సల్మాన్ ఖాన్ ఈ రీమేక్ లో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ చిత్ర రీమేక్ రైట్స్ భారీగానే అమ్ముడుపోయాయని టాక్ కూడా వచ్చింది.

త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బాలీవుడ్ లో డిమాండ్ ఏర్పడటం తో భారీ ధర ని ప్రకటించేసారు. అయితే ఈ చిత్ర రీమేక్ హక్కులు ఇంకా ఎవరికీ యివ్వలేదని, తానే స్వయంగా బాలీవుడ్ లో నిర్మించాలని భావిస్తున్నట్లు అల్లు అరవింద్ అన్నట్లు సమాచారం. మరి ఈ విషయం నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.