పర్సనల్ గా ఆ చిత్రం బాగా నచ్చింది – అల్లు అర్జున్

Friday, October 2nd, 2020, 11:12:41 PM IST


పలాస 1978 చిత్రం తో దర్శకుడు కరుణ కుమార్ చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి వాస్తవాలను ప్రతిబింబించేలా తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం కమర్షియల్ గా కాకపోయిప్పటికీ, ప్రేక్షకులు చాలా ఆదరించారు. ఈ సినిమా అనంతరం అల్లు అరవింద్ నిర్మాణం లో ఒక సినిమా చేసే అవకాశం కూడా వచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ చిత్రం పై అల్లు అర్జున్ పలు వ్యాఖ్యలు చేశారు.

ఈ చిత్రాన్ని తాజాగా చూసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్త యూనిట్ ను పొగడ్తల తో ముంచేశాడు. వ్యక్తిగతం గా తనకు ఈ చిత్రం చాలా బాగా నచ్చింది అని చెప్పుకొచ్చారు. చిత్రం చూసినా మరుసటి రోజున దర్శకుడిని కలిసి అభినందించి న విషయాన్ని తెలిపారు. అంతేకాక గొప్ప అంతర్లీన సందేశం తో అద్భుత ప్రయోగం చేసినట్లు వివరించారు. అయితే దర్శకుడు తో దిగిన ఫోటో ను సైతం అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు సన్నివేశాలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.