“ఆర్ఆర్ఆర్” నటి అలియా కి కరోనా వైరస్ పాజిటివ్

Friday, April 2nd, 2021, 10:26:02 AM IST


భారత్ లో మళ్ళీ కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. భారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండటం పట్ల ప్రజలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే స్టార్ హీరోలను, హీరోయిన్ లని సైతం కరోనా విడిచి పెట్టడం లేదు. తాజాగా రౌద్రం రణం రుధిరం చిత్రం లో సీత పాత్రలో నటిస్తున్న అలియా భట్ కి కరోనా వైరస్ సోకింది. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు అలియా.ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉంటున్నట్లు తెలిపారు. వైద్యుల సలహా మేరకు అన్ని ప్రోటోకాల్స్ పాటిస్తున్న విషయాన్ని వెల్లడించారు. అయితే తనకు అండగా నిలిచిన అభిమానుల తో పాటుగా, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ చెప్పుకొచ్చారు.

ఇటీవల కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకున్న అలియా భట్ కి ఫలితాల్లో కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రంలో సీత పాత్ర లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కి చిన్న గ్యాప్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గంగుభాయ్ కతియా వాడి చిత్రం లో కూడా నటిస్తుంది అలియా.