బాహుబలి ప్రభాస్ పక్కన బాలీవుడ్ భామ…క్రేజీ కాంబినేషన్ వర్కౌట్ అయ్యేనా?

Thursday, May 21st, 2020, 06:50:51 PM IST


బాహుబలి చిత్రం తో ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ హీరో గా ఎదిగారు. ఆ చిత్రం తో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ చిత్ర అనంతరం సా హొ చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ఈ చిత్రం టాలీవుడ్ లో అంతంత మాత్రం గా వసూళ్లను రాబట్టినా, బాలీవుడ్ లో మాత్రం ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటించింది. అయితే ప్రభాస్ ప్రస్తుతం ఒక రొమాంటిక్ పీరియాడిక్ డ్రామా లో నటిస్తున్నారు. ఈ చిత్రం జిల్ ఫేమ్ రాధ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే ప్రభాస్ బాహుబలి కోసం చాలా ఏళ్ల సమయం కేటాయించడం తో సినిమాలు ఎక్కువ చేసే అవకాశం కోల్పోయారు. ప్రతి సినిమా కు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అయితే నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఒక సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ సైతం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించేందుకు బాలీవుడ్ భామ అలియా భట్ ను సంప్రదించగా, సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇప్పటికే అలియా భట్ RRR చిత్రంలో నటిస్తున్నారు. అయితే లాక్ డౌన్ ముగిసిన అనంతరం దర్శకుడు నాగ్ అశ్విన్ అలియా భట్ కి పూర్తి స్థాయిలో కథ వినిపిస్తారట. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ వర్కౌట్ అయితే పాన్ ఇండియన్ సినిమా దద్ధరిల్లుతుంది అని కొందరు భావిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.