మరొకసారి పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అలీ!

Tuesday, June 2nd, 2020, 01:55:09 PM IST

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో అలీ, పవన్ కళ్యాణ్ ల స్నేహం గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలా బిజీ గా ఉండటం వలన పలు కొన్నింటికి దూరంగా ఉన్నారు. అయితే అలీ గత ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చి, వైసీపీ కి మద్దతు తెలిపారు. అయితే ఈ కారణమో ఏమో, కానీ మళ్ళీ వీరు ఎక్కడా కలవలేదు.

అయితే తాజాగా ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై అలీ కొన్ని ఆసక్తి కర విషయాలు వెల్లడించారు. సినిమాల్లో ఉన్నపదు చిరు కోసం ఇంటికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ ను కలిసే వాడ్ని అని, ఇంకా పవన్ అపుడు సినిమా లోకి రాలేదు అని అన్నారు. అయితే సినిమా కబుర్లు ఎక్కువగా చెప్పుకొనే వాళ్ళం అని వ్యాఖ్యానించారు.ఒక అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, అజ్ఞాతవాసి చిత్రాల లో తప్ప పవన్ నటించిన అన్ని చిత్రాల్లో నటించాను అని అన్నారు.మా జర్నీ బాగా సాగింది అని అన్నారు.

అయితే ఎపుడు మామిడి పండ్లు పంపే పవన్ కళ్యాణ్, ఈ ఏడాది తనకు ఆ ఆర్గానిక్ మామిడి పళ్ళ ను ఇంకా పంపలేదు అని అన్నారు. రాజకీయాల్లో బిజీ గా ఉండటం వలన ఈ ఏడాది తనకు పంపలేదు అని అలీ అన్నారు. వచ్చే ఏడాది అయినా పంపుతారమో చూడాలి అని అలీ వ్యాఖ్యానించారు. చిరు కి అలీ, బ్రహ్మానందం ఇష్టం అని, ఇంట్లొ జరిగే ప్రతి వేడుకకు మమ్మల్ని ఆహ్వానిస్తారు అని అలీ అన్నారు.