అక్కడ కూడా రికార్డులు కొల్లగొట్టిన ‘అల వైకుంఠపురంలో’..!

Friday, December 11th, 2020, 01:00:47 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురంలో సినిమా ఈ ఏడాది బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. అయితే నిత్యం ఏదో ఒక విషయంలో రికార్డులు సెట్ చేస్తూనే వస్తున్న ఈ సినిమా తాజాగా తన ఖాతాలో మరో రికార్డును నమోదు చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ప్లిక్స్‌లో దక్షిణాదిలో అత్యధికంగా చూసిన సినిమాల్లో టాప్-10 చిత్రాలను ఆ సంస్థ ప్రకటించింది.

అయితే ఈ జాబితాలో అల వైకుంఠపురంలో సినిమా తొలిస్థానంలో నిలిచింది. ఈ సినిమా తర్వాతి స్థానాల్లో దుల్కర్ సల్మాన్ నటించిన తమిళ చిత్రం కన్నం కన్నం కొల్లయ్యదితల్, అన్నాబెన్ నటించిన మలయాళ చిత్రం కప్పెలా, సత్యదేవ్ నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య నిలిచాయి.