మరో సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేసిన “అలవైకుంఠపురంలో”..!

Thursday, August 27th, 2020, 02:33:05 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురంలో నిత్యం ఏదో ఒక విషయంలో రికార్డులు సెట్ చేస్తూ వస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా తన ఖాతాలో మరో రికార్డును నమోదు చేసుకుంది.

గత వారం ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమైన ఈ సినిమాకు ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు రాని విధంగా 29.4 రేటింగ్స్‌ను సాధించింది. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదలై 7 నెలలు అయ్యింది, ఓటీటీలో విడుదలై 6 నెలలు అవుతుంది. అయినప్పటికి టీవీలో 29.4 రేటింగ్స్‌ సాధించి మరో సెన్సేషన్ రికార్డును సొంతం చేసుకుంది. సినిమాపై ఇంత ఆధారాభిమానాలు కురుపిస్తున్న అభిమానులకు గీతా ఆర్ట్స్‌తో పాటు హారిక, హాసిని క్రియేషన్స్ కృతజ్ణతలు తెలిపాయి.