అక్కినేని అఖిల్ అక్కడ దూసుకుపోతున్నాడు గా!!

Friday, August 7th, 2020, 02:06:54 AM IST


అక్కినేని అఖిల్ సినీ పరిశ్రమ లోకి అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అవుతోంది. అయినప్పటికీ ఒక్క క్లీన్ హిట్ ను కూడా దక్కించుకోలేక పోయారు. అయితే 2019 లో విడుదల అయిన మిస్టర్ మజ్ను చిత్రం ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనను రాబట్టుకొని బాక్సాఫీస్ వద్ద యావరేజ్ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ చిత్రం బాలీవుడ్ లో దుమ్ము రేపుతోంది. హిందీ డబ్బింగ్ వెర్షన్ ను ఇటీవల యూ ట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరిగింది. అయితే కేవలం ఒక్క నెలలోనే 10 కోట్ల వ్యూస్ ను రాబట్టింది. జూన్ 4 న అప్లోడ్ చేయగా ఇపుడు వ్యూస్ లో దూసుకుపోతుంది.

అక్కినేని అఖిల్ నటించిన మిస్టర్ పర్ చిత్రం లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అయితే అఖిల్ ప్రస్తుతం మాంచి హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల కి సిద్దం గా ఉన్నది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చిత్రం వాయిదా పడింది. ఈ చిత్రం లో అఖిల్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఇటీవల విడుదల కాగా ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.