ప్లాప్స్ లో ఉన్నా అఖిల్ సినిమాకు భారీ ధర.!

Tuesday, August 4th, 2020, 09:00:50 AM IST

అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అక్కినేని అఖిల్ తెలుగు తెరకు పరిచయం అయ్యి ఐదేళ్లు కావస్తోంది. ఇప్పటికే మూడు సినిమాలు చేసిన అఖిల్ ఏ ఒక్క దానితో కూడా సరైన విజయాన్ని అందుకోలేక పోయాడు. అయితే ఎంత స్టార్ హీరో కొడుకు అయినా సరే వరుస ప్లాపులలో ఉంటే వారి మార్కెట్ పడిపోవడం ఖాయం.

కానీ ఊహించని విధంగా అఖిల్ కు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం అఖిల్ తన నాలుగో సినిమా “బొమ్మరిల్లు” భాస్కర్ తో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భాస్కర్ కూడా ప్లాప్స్ లో ఉన్నప్పటికీ అతని సినిమాలు అంటే మంచి పాజిటివ్ నెస్ ఉంటుంది.

అలా ఈ చిత్రానికి శాటిలైట్ రైట్స్ కు భారీ ధరే పలికినట్టు తెలుస్తుంది. తెలుగు టాప్ ఛానెల్ అయినటువంటి స్టార్ మా వారు 6 కోట్లు పెట్టి కొన్నట్టు సమాచారం. ఇది మాత్రం అఖిల్ సినిమాకు పెద్ద ఫిగరే అని చెప్పాలి.ఇదిలా ఉండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో విడుదల కానుంది.