హాట్ టాపిక్: శర్వానంద్ కి జోడీగా ఈ టాలెంటెడ్ బ్యూటీ!?

Tuesday, September 15th, 2020, 10:59:16 PM IST


తెలుగు సినీ పరిశ్రమ లో ఓకే ఒక్క చిత్రం తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు అజయ్ భూపతి. RX 100 చిత్రం బ్లాక్ బస్టర్ విజయం తో ఈ డైరెక్టర్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే చాలా గ్యాప్ తర్వాత శర్వానంద్ తో చిత్రం చేసేందుకు సిద్దం అయ్యారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం వెలువడిన సంగతి తెలిసిందే. మహా సముద్రం టైటిల్ గా తెరెక్కుతున్న ఈ చిత్రం లో హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ తల మునకలుగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం శర్వానంద్ కి జోడి గా టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల ఈ చిత్ర కథ విన్న హీరోయిన్ వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఐశ్వర్య మరొకసారి తెలుగు చిత్రంలో నటించనుంది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే టాలీవుడ్ లో మరొక క్రేజీ కాంబినేషన్ చూసే అవకాశం ఉంది. ఈ చిత్రం లో సిద్ధార్ద్ కూడా ఒక కీలక పాత్ర లో నటిస్తున్నట్లు సమాచారం. అయితే శర్వానంద్ ప్రసుత్తం శ్రీకారం చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి అవ్వగానే మహా సముద్రం లో నటించ నున్నారు.