ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కు ముద్దిచ్చిన వేళ

Wednesday, April 13th, 2016, 03:40:21 PM IST


ఎవరికైనా ఒక అందగత్తెకు ముద్దిచ్చే అవకాశమొస్తే సంతోషపడతారు. ఆ అందగత్తె ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ అయితే.. చెప్పాలా ఎగిరి గంతేస్తారు. ఆ అవకాశమే ఓ జర్మలిస్టుకు వచ్చింది.. కాదు.. కాదు వచ్చేలా చేసుకున్నాడు. బ్రిటన్ రాజ దంపతులు విల్లియం, కేట్ లు ఇండియా పర్యటనకు వచ్చిన సందర్బంగా తాజ్ ప్యాలెస్ వేదికగా ఓ చారిటీ విందు జరిగింది. ఆ విందుకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వారిలో ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ కూడా ఉంది.

ఐశ్వర్య హోటల్లోకి రాగానే కాసేపు మీడియాకు ఫోటో ఫోజులిచ్చింది. ఆ సమయంలోనే ఓ జర్నలిస్ట్ అస్వర్యకు షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు ఆమె చేతిని అందుకుని క్షణం కూడా ఆలస్యం చేయకుండా హుందాగా ముద్దుపెట్టుకున్నాడు. దాంతో అక్కడున్న వారందరూ అవాక్కయ్యారు. కానీ ఐశ్వర్య మాత్రం దాన్ని చాలా ఈజీగా తీసుకుని నవ్వుతూ వెళ్ళిపోయింది. దీంతో అక్కడున్న వారందరూ ఆహా నీది ఏం అదృష్టం బ్రదర్ అంటూ అతన్ని మెచ్చుకున్నారు.

వీడియో కొరకు క్లిక్ చేయండి :