పింక్ రీమేక్‌లో సిద్ శ్రీరామ్ పాట.. మరోమారు ట్రెండ్ అవ్వాల్సిందే..!

Thursday, February 13th, 2020, 06:57:15 PM IST

అలవైకుంఠపురంలో సిద్ శ్రీరామ్ పాడిన సామజవరగమన సాంగ్ ఎంతగా ఆకట్టుకుందో పెద్దగా చెప్పనక్కర్లేదు. ఈ పాటకు తమన్ మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో మరో పాట రాబోతుంది. అది కూడా పవన్ కళ్యాణ్ నటిస్తున్న పింక్ రీమేక్ నుంచి కావడం విశేషం.

అయితే వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు లాయర్ సాబ్ లేదా వకీల్ సాబ్ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ సినిమాలో మీరు ఊహించింది నిజమే మళ్ళీ మేమిద్దరం కలిశాము. పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ సినిమాలో ఒక పాటను సిద్ పాడాడు. ప్రాణం పెట్టి ఈ పాటను కంపోజ్ చేశాము. ఈ పాటను మీకు ఎప్పుడెప్పుడు వినిపిస్తామా అని ఎదురుచూస్తున్నా అంటూ ధమన్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాను మేలో రిలీజ్ చేస్తామని ఇదివరకే నిర్మాత దిల్‌రాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.