అడివి శేష్ కారు పోలీసులు ఆపారట… ఎందుకో తెలుసా?

Thursday, February 18th, 2021, 08:30:43 AM IST

అడివి శేష్ క్షణం అనే చిత్రం తో ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయ్యారు. తన గూఢచారి, ఎవరు చిత్రాలతో అభిమానులకు ఫుల్ థ్రిల్ కలిగిస్తూ విభిన్న చిత్రాల హీరో గా పేరు తెచ్చుకున్నారు. అయితే అడివి సేష్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకుంటున్నాయి. అదే తరహా అడివి శేష్ త్వరలో మేజర్ అనే చిత్రం తో ప్రేక్షకులను అరించడానికి సిద్దం అవుతున్నారు. అయితే తాజాగా శేష్, సుమంత్ నటించిన కపటాధారి ప్రి రిలీజ్ వేడుక కి హాజరు అయ్యారు అడివి శేష్. అయితే చిత్రం లో ఉన్న ఇంటరెస్టింగ్ సన్నివేశాల దృష్ట్యా, అడివి శేష్ తనకు నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి వేదిక పై వివరించారు.

ఒకసారి ఔటర్ రింగ్ రోడ్ వద్ద కారు లో వెళ్తుండగా, అడివి శేష్ కారును పోలీసులు ఆపారు అని అన్నారు.అయితే హై స్పీడ్ వలన అతని కారు పై ఆరు చలానా లు ఉన్నాయి అని తెలిపారు. అయితే ట్రాఫిక్ పోలీసులు ఆ చలానా లు కట్టించి పంపిన విషయాన్ని శేష్ వెల్లడించారు. అయితే కపటధారి అనే చిత్రం ఒక ముప్పై ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసును ట్రాఫిక్ పోలీస్ ఎలా పరిష్కరించారు అనేది.అయితే ఈ ప్రి రిలీజ్ వేడుక లో అడివి శేష్ తనకు జరిగిన ఘటన గురించి చెప్పడం తో సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.